Puttaparthi Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్ తగిలింది. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నాయకులు వడ్డే వేణుగోపాల్, కె పెద్దన్న, వెంకటస్వామి, మల్లికార్జున రెడ్డి, పురుషోత్తం రెడ్డి సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. పార్టీ కండువాలతో వారిని సాదరంగా ఆహ్వానించారు సీఎం జగన్. జనసేన పార్టీ నాయకులు తిరుపతేంద్ర, లోకేష్, బాబు, సతీష్ కూడా వైసీపీ పార్టీలో చేరారు.
పుట్టపర్తి టీడీపీ టికెట్ ఆశించి వడ్డే వేణుగోపాల్ భంగపడ్డారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు పుట్టపర్తి టికెట్ పల్లె రఘునాథ రెడ్డి కోడలు సింధూర రెడ్డికి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వేణుగోపాల్ మస్తాపం చెంది తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
307 మంది వలంటీర్లు రాజీనామా
అనంతపురం జిల్లా తాడిపత్రిలో 307 మంది వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కలిసి తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వలంటీర్ ఉద్యోగాలు వదులుకున్నట్టు వీరు వెల్లడించారు.
Also Read: అందుకోసమే చంద్రగిరిని వదిలి ఒంగోలుకు వచ్చా: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి