ఒంగోలులోనూ మంచి పేరు తెచ్చుకుంటా: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయకుండా కుప్పం ఎందుకు వెళ్లారు? చంద్రగిరిలో పుట్టిన లోకేశ్‌ మంగళగిరికి ఎందుకు వెళ్లారు?

ఒంగోలులోనూ మంచి పేరు తెచ్చుకుంటా: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Updated On : April 1, 2024 / 1:01 PM IST

Chevireddy Bhaskar Reddy: ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చడమే తన ధ్యేయమని, అందుకోసమే చంద్రగిరిని వదిలి ఇక్కడికి వచ్చాను తప్ప మరో కారణం లేదని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా, పొదిలి మండల వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై విమర్శలు చేశారు.

చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయకుండా కుప్పం ఎందుకు వెళ్లారు? చంద్రగిరిలో పుట్టిన లోకేశ్‌ మంగళగిరికి ఎందుకు వెళ్లారు? చంద్రగిరిలో పోటీచేసి చంద్రబాబు ఓడిపోయాడు, అదే చంద్రగిరిలో పుట్టి నేను పోటీచేసి 40 వేల మెజారిటీతో గెలిచాను. ఎవరి వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుసు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చింది ఎవరని చంద్రగిరి ప్రజలను అడిగితే ఎవరేంటనేది చెబుతారు. నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. ఈ ప్రాంత ప్రజలకు మంచి చేసి మీ హృదయాలను గెలిస్తే అదే నాకు చాలు.

Also Read: టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

చంద్రగిరిని ఏవిధంగా అభివృద్ధి చేశానో అదే విధంగా ఒంగోలు పార్లమెంట్‌ను అభివృద్ధి చేస్తాను. అందుకోసం వైసీపీ శ్రేణులంతా మనస్పూర్తితో నాకు సహకరించాలి. ఇక నుంచి జీవితాంతం నా రాజకీయ పయనం ఒంగోలు పార్లమెంట్ నుంచే. కష్టపడి ఒక కార్యకర్తగా జగన్ అండతో నాయకుడిగా పైకి ఎదిగి నోన్ని. కష్టాలు తెలిసినొన్ని కాబట్టి ఈ ప్రాంత కష్టాలు తీర్చి.. సీఎం జగన్ మంచి నాయకున్ని మీ ఒంగోలు పార్లమెంట్‌కు పంపాడనే మంచి పేరు తెచ్చుకుంటాను. సీఎం జగన్ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

Also Read: కరణం వెంకటేశ్ వర్సెస్ కొండయ్య.. చీరాలలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ