Ragging incidents
Siddhartha College Raging : ఇటీవల కాలంలో ర్యాగింగ్ (Ragging incidents) కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ర్యాంగింగ్ నియంత్రించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా.. దానికి అడ్డుకట్ట పడడం లేదు. కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని ఉప్పల్ మేడిపల్లి ప్రాంతంలోని ఓ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్‌ను ర్యాగింగ్ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా.. ఏపీలోని తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతంలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఓ విద్యార్థిపై ఐదుగురు విద్యార్థులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పుత్తూరులోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ యువతి ప్రేమ వ్యవహారం విద్యార్థుల మధ్య గొడవకు కారణమైంది. వారి మధ్య గొడవ తీవ్రం కావడంతో.. ఐదుగురు విద్యార్థులు ఓ విద్యార్థిని హాస్టల్ గదిలోకి తీసుకొచ్చి చితకబాదారు. విద్యార్థిపై కాళ్లతో తంతూ చిత్ర హింసలకు గురిచేశారు. తనను కొట్టొద్దు అంటూ విద్యార్థి వేడుకున్నా.. తొటి విద్యార్థులు రౌడీల్లా అతనిపై దారుణంగా దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో కళాశాల యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది.
ఘటనకు కారకులైన కడపకు చెందిన ఆరుగురు పాలిటెక్నిక్ విద్యార్థులపై నారాయణవనం పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాక కళాశాల నుండి వారిని సస్పెండ్ చేశారు. వీరితోపాటు వారి మధ్య గొడవకు కారణమైన యువతికిసైతం కళాశాల యాజమాన్యం టీసీ ఇచ్చి పంపేసింది.
బ్రేకింగ్
సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ భూతం
విద్యార్థిని చితకబాదిన తోటి విద్యార్థులు.. కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి
సత్యవీడు సిద్ధార్థ కాలేజీలో ఘటన..
కాలేజీ బీజేపీ నేతకు చెందిందిగా స్థానికంగా చర్చ #CBNFailedCM pic.twitter.com/Mhzr1zfpeV— Arjun Reddy (@Premalokam_) September 27, 2025