ఉత్కంఠ నడుమ.. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్

సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే ముందే ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేసేశారు. పార్టీ బీఫాం లేకుండా ఆయన నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.

Raghu Rama Krishna Raju Nomination: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి ఆయనకు సీటు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా టీడీపీ తరపున ఎవరికీ బీఫాం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేశారు.

రఘురామ కృష్ణంరాజు భార్య, కుమారుడు భరత్ శుక్రవారం ఉండి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మరోవైపు ఈ నెల 22న నామినేషన్ వేసేందుకు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కంటే రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేయడం ఉండి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పీవీఎల్ నరసింహరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి వేగేశ వెంకట గోపాల కృష్ణం పోటీ చేస్తున్నారు.

తణుకులో టీడీపీ, వైసీపీ తోపులాట
తణుకు నియోజవర్గంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటచేసుకుంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ నామినేషన్ వేసేందుకు ఒకేసారి రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Also Read: చింతమనేని సీటుకు బీజేపీ గాలం.. దెందులూరు వదులుకోవడంపై టీడీపీ టెన్షన్!

ట్రెండింగ్ వార్తలు