Heavy Rain Tirumala : తిరుమల డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌లోకి వర్షపు నీరు..పూర్తిగా ఆగిపోయిన టీటీడీ సర్వర్లు, నెట్‌వర్క్‌

తిరుమల డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌లోకి వర్షపు నీరు చేరింది. టీటీడీ సర్వర్లు, నెట్‌వర్క్‌ పూర్తిగా నిలిచిపోయాయి. తిరుపతి రెండో ఘాట్‌ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి.

Shut down TTD servers and network : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు చిత్తూరు జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. తిరుమల, తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీ పురం, వరదయ్యపాలెం, సత్యవేడు, నారాయణపురం, బిఎన్. కండ్రిగ, రేణిగుంటలో రహదారులన్నీ జలమయమయ్యాయి.

తిరుమల డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌లోకి వర్షపు నీరు చేరింది. టీటీడీ సర్వర్లు, నెట్‌వర్క్‌ పూర్తిగా నిలిచిపోయాయి. తిరుపతి రెండో ఘాట్‌ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌ రోడ్డులోకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపై బండరాళ్లు, చెట్లను టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు.

Heavy Rains In Kadapa : కడప జిల్లాలో భారీ వర్షాలు.. వరద నీటిలో చిక్కుకున్న వాహనాలు

తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి బస్టాండ్ నీట మునిగింది. తిరుపతి రహదారులు, బస్టాండ్ జలమయం అయ్యాయి. రేణిగుంట విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తిరుపతిలో ఇంటర్నెట్‌ సేవలు పూర్తిగా స్తంభించాయి. కరకంబాడి రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నడుంలోతు నీళ్లలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రెండో ఘాట్‌ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌లో రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో వాహనాల రాకపోకలను ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు పెట్టారు. కొండచరియలు, చెట్లను టీటీడీ సిబ్బంది తొలగిస్తోంది. స్పైస్‌ జెట్‌, ఎయిరిండియా, ఇండిగో విమానాలు ల్యాండ్‌ కాకుండా మళ్లాయి. పూణె, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన స్పైస్‌ జెట్‌, ఇండిగో రద్దయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు