Amaravati Bill: రాజ్యసభలోనూ గ్రీన్‌సిగ్నల్.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం

అమరావతి చట్టబద్ధత బిల్లులో ప్రత్యేకహోదాపై క్లారిటీ ఇవ్వలేదని వైసీపీ సభ్యులు తెలిపారు. ఈ కారణంగా బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి వైసీపీ వాకౌట్‌ చేసింది.

  • Published On : April 2, 2026 / 04:06 PM IST

Amaravati Bill: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు నిన్న లోక్ సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పెద్దల సభలోనూ అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ఇరుసభల నుంచి బిల్లుకు ఆమోదం దక్కినట్లైంది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక, మిగిలింది రాష్ట్రపతి ఆమోదమే. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి చట్టబద్ధత బిల్లు చట్టంగా మారనుంది.

కాగా, వైసీపీ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లులో ప్రత్యేకహోదాపై క్లారిటీ ఇవ్వలేదని వైసీపీ సభ్యులు తెలిపారు. ఈ కారణంగా బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి వైసీపీ వాకౌట్‌ చేసింది. నిన్న లోక్ సభలోనూ ఇదే జరిగింది. వైసీపీ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.

అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో 11 పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. 10 పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. వైసీపీ మాత్రం బిల్లును వ్యతిరేకించింది.

Also Read: తీసేసిన ఉద్యోగులకి ఒరాకిల్ ఎన్ని కోట్లు ఇస్తుంది? ఒక్కొక్కరికి..