సర్పంచ్ ప్రమాణస్వీకారోత్సవంలో అశ్లీల నృత్యాలు
- bheemraj
- Published On : February 27, 2021 / 01:44 PM IST
Recording Dance in Sarpanch Swearing-in Ceremony : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా విజయం సాధించాడు. గెలిచిన ఆనందంలో తాను ఒక ప్రజాప్రతినిధి అన్న సంగతే మరిచిపోయాడు. అసాంఘిక కార్యక్రమానికి తెర తీశాడు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో గ్రామ సర్పంచ్ గ్రామస్థులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో మహిళలతో రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా అమ్మాయిలతో అసాంఘిక డ్యాన్స్ నిర్వహించారు.
గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన వేదికపైనే అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై గ్రామస్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
