Prakasam Barrage Boats Removal : ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. బోట్లకు డ్రిల్లింగ్ చేసేందుకు విశాఖ స్కూబా టీమ్ ను రంగంలోకి దింపారు. నీటిలో మునిగి ఉన్న బోట్లకు స్కూబా టీమ్ డ్రిల్లింగ్ చేయనుంది. ఆ తర్వాత మరో టీమ్ తమ పనులు మొదలు పెట్టనుంది. ఇతర బోట్ల సాయంతో విరిగిన బోట్లను గొలుసులతో కట్టి బయటకు తీయాలని భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువున ఉన్న వీఐపీ ఘాట్ వద్దకు మునిగిన బోట్లను చేర్చాలని అధికారులు చూస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బోట్ల తొలగింపు పనులు సవాల్ విసురుతున్నాయి. ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని క్రేన్లు దింపినా, ఎన్ని టీమ్ లను మార్చినా బోట్లు ముందుకు కదిలితే ఒట్టు. కార్మికులు రాత్రి పగలు తీవ్రంగా శ్రమిస్తున్నా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా అది విఫల ప్రయత్నమే అవుతోంది.
ప్లాన్ -ఏ లో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్ధ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో ప్రయత్నించినా.. ఆ బోట్లు కదల్లేదు. దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యింది. దీంతో ప్లాన్ బీలో భాగంగా ఎయిర్ బెలూన్స్ ని రంగంలోకి దించారు. అయితే, మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బీ కూడా ఫెయిల్ అయ్యింది. దీంతో బోట్లను తొలగించడానికి కచ్చులూరు బోటు ప్రమాదంలో పని చేసిన అబ్బులు టీమ్ ను కాకినాడ నుంచి తీసుకొచ్చి అధికార యంత్రాంగం.
* ప్రకాశం బ్యారేజీ దగ్గర క్లిష్టంగా మారిన బోట్ల తొలగింపు
* బోట్లను తొలగించేందుకు ఆరు రోజులుగా శ్రమిస్తున్న సిబ్బంది
* వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయం
* గొల్లపూడి నుంచి రెండు కార్గో బోట్లు తీసుకురావాలని ప్లాన్
* బోట్లలో వాటర్ నింపి బోట్లను లాక్ చేయనున్న సిబ్బంది
Also Read : కిరణ్ కుమార్ రెడ్డికే పగ్గాలు? ఏపీపై బీజేపీ భారీ స్కెచ్..!