ప్రభుత్వానికి పొగరు : మీడియాకు సంకెళ్లు..ఖండిస్తున్నాం – బాబు

  • Publish Date - December 12, 2019 / 12:34 PM IST

మీడియాకు వైసీపీ ప్రభుత్వం సంకెళ్లు వేసింది. ప్రభుత్వానికి పొగరు ఎక్కింది. జీవో నెంబర్ 2430పై గవర్నర్‌కు కంప్లయింట్ చేసి మెమోరాండం ఇచ్చాం. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం..ఎవరైనా రాస్తే..ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంటే..వారిపై కేసులు పెట్టుకొనే అధికారి కింది యంత్రాగానికి ఇవ్వడం దుర్మార్గమన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..తదితర వివరాలను ఆయన మీడియాకు వివరించారు. 

2007, ఫిబ్రవరి జీవో నెంబర్ 938 తీసుకొచ్చారని, అప్పుడు అందరం ప్రతిఘటించామన్నారు. ఆనాడు జీవోను క్యాన్సిల్ చేసుకుంటామని వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారన్నారు. ఏదో ఒక విధంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై నిరసన తెలియచేస్తే..తీవ్రంగా అడ్డుకున్నారని తెలిపారు. సభలో కూడా తాము నిరసన తెలిపి..వాకౌట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ట్రాయ్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కొన్ని ఛానెళ్లను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం చేసిందని, దీనిపై గవర్నర్‌కు కంప్లయింట్ చేశామన్నారు. కొంతమంది పత్రికా విలేకరులపై దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్పీకర్ పర్మిషన్‌తో అసెంబ్లీలో వీడియోను ప్రదర్శించాలని, కానీ అలా జరగలేదన్నారు. అది నిన్నటి వీడియోనని అంటూ..ఓ వీడియోను ప్రదర్శించారు. తనను విమర్శిస్తుంటే..ఆయనకు పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. 
Read More : మంత్రిని మెచ్చుకున్న సీఎం జగన్ : ఇంగ్లీషు మీడియా అమలు ఇలా