×
Ad

Kanaka Durga Temple : విజయవాడ దుర్గగుడిపై ఆంక్షలు

  • Published On : April 25, 2021 / 06:01 PM IST

Restrictions In Kanaka Durga Temple

Restrictions in Kanaka Durga Temple : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ పరిస్ధితుల్లో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రి పై వేంచిసిన శ్రీకనకదుర్గ గుడిలో రేపటి నుంచి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. రాత్రి 7 గంటల తర్వాత దుర్గ గుడి అంతరాలయ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఆలయ పరిసరాల్లో అర్చకులు, సిబ్బంది విధిగా మాస్కు ధరించాలని.. వారు ఏ వస్తువునూ చేతితో తీసుకోవద్దని సూచించింది. మాస్కు లేని భక్తులను గుడిలోనికి అనుమతించేది లేదని పాలక మండలి స్పష్టం చేసింది.