రాజధాని మార్పుపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్‌లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Publish Date - January 13, 2020 / 06:02 AM IST

ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్‌లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పరిస్థితుల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెరిగి, ఆదాయం పెరిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పౌరుడిగా సంతోష పడుతున్నానన్నారు. అయితే ఓ దేశ పౌరుడిగా మాత్రం బాధ పడుతున్నట్టు తెలిపారు. 

ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్‌లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతుంటే… ఏపీ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను చెప్పే ప్రయత్నం చేస్తోంది. జీఎన్ రావు కమిటి, బీసీజీ నివేదికలు వికేంద్రీకరణకే మొగ్గుచూపాయి. మూడు రాజధానులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ ఆధ్యయనం చేస్తోంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటి ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రెండు సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. 

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 29గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బలగాలతో పికెటింగ్ చేస్తున్నారు. 27 రోజులుగా రైతులు, ప్రజల ఆందోళనలు చేపడుతున్నారు. 144 సెక్షన్, 30యాక్ట్ అమల్లో ఉందని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా రాజధాని ప్రాంతవాసులు, రైతులు ఏమాత్రం తగ్గట్లేదు. ఒక్క అమరావతే ముద్దు… మూడు రాజధానులు వద్దంటూ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ… వైసీపీ ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అమరావతి రైతులకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తుంది. యువత…రైతులకు మద్ధతు తెలుపుతుంది. ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా అమరావతి రైతులకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. అమరావతి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని ప్రవాసాంధ్రుల నుంచి కూడా మద్ధతు లభిస్తోంది. సేవ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో అమెరికాలో ఎన్నారైలు వివిధ నగరాల్లో సమావేశాలు, నిరసనలు చేపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి…అధికార వికేంద్రీకరణ కాదు..అంటూ ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. కాలిఫోర్నియా, ఒమాహ, కాన్సాస్‌ సిటీ, కొలంబస్‌, డల్లాస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనలు, సమావేశాలు చేపట్టారు.