డబ్బులను ఆదా చేయడానికి : మద్యం షాపుల అద్దెలపై రివర్స్ టెండరింగ్

  • Publish Date - January 30, 2020 / 04:20 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా పలు శాఖల్లో అవినీతి జరిగిందంటూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. దీనివల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టు్ల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టింది. తాజాగా మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు జిల్లాలో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు గదుల అద్దెలను ఖరారు చేశారు. కానీ..ఈ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు కంప్లయింట్స్ వచ్చాయి. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. 

ప్రైవేటు మద్యం దుకాణాలను నిర్వహించిన చోటే..ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు సూచించడంతో అధిక ధరలతో అద్దెకు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి..ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం రివర్స్ టెండర్లు నిర్వహించి డబ్బులను ఆదా చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. 

Read More : Breaking News : కరోనాకు కారణం చైనాయే..ఇజ్రాయల్ నిపుణుడు