AP Corona Cases: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో యాక్టీవ్ కేసు నమోదు.. ప్రభుత్వం బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ (AP Corona Cases)తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లండన్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
- V Santhosh Kumar
- Updated on- July 19, 2026 / 08:27 PM IST
Rising number of active Corona cases in Andhra Pradesh
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు
- ఏపీలో పదహారుకు చేరిన బాధితులు
- నలుగురు మృతి చెందడం విచారకరం
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లండన్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితుడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతనితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపుతూ అధికారులు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ కొత్త కేసుతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16కు చేరింది.
Samsung Layoffs: శాంసంగ్ ఉద్యోగులకు షాక్.. భారీగా ఉద్యోగాల కోత.. 400 మందికి పైగా..
బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి:
ప్రస్తుతం చికిత్స పొందుతున్న 16 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైరస్ (AP Corona Cases)లక్షణాలు స్వల్పంగా ఉన్న మరో నలుగురిని హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ముగ్గురు పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వ ముందస్తు జాగ్రత్తలు:
రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, మరణాల రేటును తగ్గించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదని, స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
