Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Road Accident : ఏపీలో చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
- Harish Thanniru
- Published on- March 28, 2026 / 09:19 AM IST
Road Accident
- చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
- మృతులు వరంగల్ జిల్లా వాసులుగా గుర్తింపు
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
చిత్తూరు జిల్లా (Chittoor district) బంగారుపాళ్యం మండలంలోని తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టంది. మృతుల్లో దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మితోపాటు నాలుగేళ్ల చిన్నారి ఆద్విక ఉన్నారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకొని ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని.. వరంగల్ కు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మీ, ఆద్వికగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
