Vizianagaram : ఇంట్లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయం!.. ఎదురింట్లో ఆనవాళ్లు
బెడ్‌రూమ్‌లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు చేశారు.
- kunduru Vinod
- Published On : October 19, 2021 / 12:31 PM IST
Vizianagaram
Vizianagaram : బెడ్‌రూమ్‌లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు చేశారు. క్లూస్‌టీమ్‌ను రంగంలోకి దింపారు. డాగ్‌స్వాడ్ కూడా రావడంతో ఇక వారి పని ప్రారంభించారు. ఇంట్లో పలు చోట్ల తవ్వలకు జరిపారు, సోదాలు చేశారు. ఇంట్లో ఎక్కడ డబ్బు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో తనిఖీలు చేపట్టారు అక్కడ రూ.19 లక్షలు దొరికాయి. ఈ డబ్బు దొరకగానే సమస్య తాము పరిష్కరించుకుంటామని ఇక మీరు వెళ్లొచ్చని పోలీసులకు సెలవుచాడు యజమాని. దీంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా ఈ ఘటన విజయనగరం జిల్లా భీమిలి జోన్ రెండో వార్డులోని మేడ చిన్నారావు అలియాస్ గురుమూర్తి ఇంట్లో చోటుచేసుకుంది.
చదవండి : Wardrob Full Of Money : ఈ బీరువాల్లో ఉన్నవి బట్టలు కాదు..కరెన్సీ కట్టలు..
వివరాల్లోకి వెళితే.. గురుమూర్తి కర్రపెండలం వ్యాపారం చేస్తారు. ఈ ఏడాది మార్చిలో గణపతినగరం వద్ద తనకున్న భూమిని రూ.75 లక్షలకు విక్రయించాడు. అందులో రూ.20 లక్షలను బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షలను ఇంట్లో గొయ్యి తీసిపాతిపెట్టారు. అయితే ఈ నెల 17వ తేదీ గురుమూర్తి ఇద్దరు కొడుకులు, కోడళ్ళు ఇంటికి వచ్చారు. ఇదే సమయంలో డబ్బు పాతిపెట్టిన దగ్గర కొత్తగా సిమెంట్ వేసినట్లు కనిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూశారు.
చదవండి : Monkey Steals Money : కొంపముంచిన కోతి.. లక్ష రూపాయలు ఎత్తికెళ్లి రోడ్డుపై చల్లింది
అయితే గోతిలో డబ్బు కనిపించలేదు.. దీంతో ఇల్లంతా జల్లెడపట్టారు. ఎక్కడ డబ్బు ఆనవాళ్లే లేవు. రూ.55 లక్షల డబ్బు పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గురుమూర్తి. రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎదురింట్లో తవ్వకాలు చేపట్టగా రూ.19 లక్షల నగదు దొరికింది.. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సమయంలోనే ఈ సమస్యను తాము పరిష్కరించుకుంటామని మీరు వెళ్లొచ్చని సెలవిచ్చారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు. అయితే ఆ ఎదురింట్లో నివసిస్తున్నాడు గురుమూర్తి ఇద్దరు కుమారులే.
