Wardrob Full Of Money : ఈ బీరువాల్లో ఉన్నవి బట్టలు కాదు..కరెన్సీ కట్టలు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బీరువా వైరల్ గా మారింది. ఆ బీరువా నిండా కరెన్సీ కట్టలే.

Wardrob Full Of Money : ఈ బీరువాల్లో ఉన్నవి బట్టలు కాదు..కరెన్సీ కట్టలు..

Wardrob Full Of Money

Wardrob Full Of Money Found After An IT Raid : ప్రతీ ఇంటిలోను బీరువాలు ఉంటాయి. ఆ బీరువాల్లో బట్టలుంటాయి. మధ్యలో ఓ లాకర్ఉంటుంది. ఆ లాకర్ లో ఏదో కొద్దిగా డబ్బులు..చిన్న చిన్న విలువైన వస్తువులు ఉంటాయి. ధనవంతులైతే నోట్ల కట్టలు..పెద్ద పెద్ద బంగారు నగలు పెట్టుకుంటారు. ఇంకా ధనవంతులైతే..భారీ సంఖ్యలో నోట్ల కట్టలు పెట్టుకుంటారు. కానీ ఓ బీరువాలో మాత్రం మొత్తం నిండుగా నోట్ల కట్టలే పేర్చి ఉన్నాయి. ఎక్కడా చీమదూరే సందుకూడా లేకుండా మొత్తం బీరువా నిండా నోట్ల కట్టలే కట్టలు. ఇంతకీ ఆ బీరువా ఎవరిది?అనే కదా మీ డౌటు? ఎవరిదీ అంటూ ‘ఇన్ కమ్ ట్యాక్స్’అధికారుల ఆఫీసులో ఉండే బీరువా అది. అందుకే మొత్తం ఫుల్ గా కరెన్సీ కట్టలే గుట్టలుగా పేర్చి ఉన్నాయి.

This almirah has over Rs 142 crore stuffed in it! Here's the story behind it

హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు జరిపిన క్రమంలో ఐటీ అధికారులు సోదాల్లో 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించింది ఐటీ శాఖ. ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

Read more : Hetero Pharma : హెటిరో ఫార్మా కార్యాలయాల్లో ఐటీ సోదాలు

500 notes found in fraudulent… Income tax department's raid; People say, "Denomination has not worked" - Maharashtra Pradesh

బట్టలు పెట్టుకునే బీరువా నిండా చీమ కూడా దూరనంత టైటుగా డబ్బుల కట్టల్ని పేర్చి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. సాధారణంగా సామాన్యులు బీరువాలో బట్టలు పెట్టుకుంటారు. మధ్యలో ఏదో చిన్న లాకర్ లో ఏవో చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటారు. కానీ సదరు ఐటీ కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండా పేర్చేసింది.

Srikrishna Jewelers : భారీ గోల్డ్ స్కామ్ కేసు…హైదరాబాద్ శ్రీకృష్ణ జువెలర్స్ లో ఈడీ సోదాలు

ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్‌ ఉంటుంది..ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్‌ సెటిల్‌ అయిపోతుంది..అలా వాటిని పేర్చుకుని పెట్టేకంటే వాటిని ఏదన్నా చేయండి సారులు అంటున్నారు. మరికొందరైతే..అన్ని ఐదు వందల రూపాయల కట్టేలే ఉన్నాయి..2 వేల రూపాయల కట్టలు పెడితే ఇంకా కాస్త ప్లేస్ ఉండేది కదా అంటున్నారు.