Srikrishna Jewelers : భారీ గోల్డ్ స్కామ్ కేసు…హైదరాబాద్ శ్రీకృష్ణ జువెలర్స్ లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో మరో భారీ గోల్డ్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్‌ శ్రీకృష్ణ జువెలర్స్‌లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది.

Srikrishna Jewelers : భారీ గోల్డ్ స్కామ్ కేసు…హైదరాబాద్ శ్రీకృష్ణ జువెలర్స్ లో ఈడీ సోదాలు

Srikrishna

Massive Gold Scam Case : హైదరాబాద్‌లో మరో భారీ గోల్డ్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్‌ శ్రీకృష్ణ జువెలర్స్‌లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నగరంతో పాటు దేశ వ్యాప్తంగా షాపులు, కార్యాలయాల్లో 35 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు.. 2019లోనే శ్రీకృష్ణ జువెలర్స్‌పై కేసు నమోదు చేశారు. అప్పట్లోనే సంస్థ ఎండీ ప్రదీప్‌, ఆయన కుమారుడు సాయి చరణ్‌ సహా నలుగురిని అరెస్టు చేశారు. రావిరాల జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ పార్కులోని శ్రీకృష్ణ జువెలర్స్‌లో భారీ కుంభకోణం జరిగినట్టు గుర్తించారు.

contraceptive pills : గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు పరిశోధకుల కీలక సూచనలు

విదేశాల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన 11 వందల కిలో బంగారాన్ని డైవర్ట్‌ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్టు గతంలోనే డీఆర్‌ఐ గుర్తించింది. ఆభరణాల ఎగుమతిలో కుంభకోణం జరిగినట్టు తేల్చింది. ఆభరణాల్లో అమర్చిన వజ్ర, వైడూర్యాల లెక్కుల లేవని తేలింది.

మణీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. DRI 2019కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. నగరంలో గుర్తింపు పొందిన శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ..బంగారం దిగుమతి విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు 2019 DRI కేసు నమోదు అయింది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్‌ను గతంలో డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు

రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోనం జరిగినట్టు గుర్తించారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1100 కిలోల బంగారాన్ని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ డైవర్ట్ చేసినట్టు గతంలో ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గతంలో డీఆర్ఐ గుర్తించింది.

ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆభరణాల్లో పెట్టిన వజ్ర వైడూర్యాలకు సంబంధించి కూడా సరైన లెక్కలు చూపని వైనం నెలకొంది. హైదరాబాద్ లోని శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన షోరూంలు అన్నింటిలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాగా శ్రీ కృష్ణ జ్యువెల్లరి సంస్థ దేశ వ్యాప్తంగా 35 షోరూంలు నిర్వహిస్తోంది.