contraceptive pills : గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు పరిశోధకుల కీలక సూచనలు

గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి పరిశోధకులు పలు కీలక అంశాలను వెల్లడించారు.

contraceptive pills : గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు పరిశోధకుల కీలక సూచనలు

Contraceptive Pills Adverse Effects

contraceptive pills Adverse effects : గర్భం ధరించాలా? వద్దా? అనేది మహిళల వ్యక్తిగత విషయం. అలా గర్భం రాకుండా ఉండటానికి చాలామంది మాత్రలు వాడతారు.ఒకప్పుడు ఇటువంటి మాత్రలు ఉండేవికావు. కానీ 1960 లో గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో అవి వాడితే ఇక గర్భం రాదని ఎప్పటికీ పిల్లలు పుట్టరనే అపోహలు ఉండేవి. కాలక్రమంలో అపోహలు తొలగిపోయాయి. చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడటం మొదలుపెట్టారు.కానీ ఈ మాత్రలు వేసుకోవటం వల్ల గర్భం రాదు. కానీ వీటిని ఎక్కువగా వాడితే దుష్ర్పభావాలు ఎక్కువేనని చెబుతన్నారు నిపుణులు చెబుతున్నారు. ఈ మాత్రలు వాడాలను అనుకుంటే కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని..వారి సూచనల మేరకే వాడాలని సూచిస్తున్నారు. గర్భనిరోధక మాత్రల వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో తెలుసుకుందాం..ఒక వేళ వాటిని వాడాల్సి వస్తే ఎలా వాడాలి? ఎంతకాలం వాడాలి? ఎక్కువగా వాడితే కలిగే దుష్ప్రభావాలేంటో? వాటి వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..

Read more : Tests for women : 30 ఏళ్లు దాటిన మహిళలకు ఈ 6 పరీక్షలు తప్పనిసరి!

గర్భనిరోధక మాత్రల్లో సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి నెల గర్భాశయంలో అండం పెరుగకుండా ఆపుతుంది. చాలా మంది మహిళలు, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. చాలామంది వాటినే కంటిన్యూ చేస్తుంటారు. అంటే ఎక్కువగా వాడుతుంటారు. అలా ఎక్కువగా వాడటం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి మాటేమో గానీ చెడు ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడితే శారీరక, మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని..హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుందని చెబుతున్నారు.

గర్భనిరోధక మాత్రలు వచ్చాక తాము గర్భం ధరించాలా? వద్దా? అనే విషయం భార్యాభర్తలు ఆలోచించుకుని వాడేవారు. కానీ అప్పుడే పిల్లలు వద్దనే ఆలోచనతో వాటిని ఎక్కువగా వాడటం అంత మంచిదికాదు. అలా రానురాను ఈ మాత్రల వల్ల కలిగి దుష్ప్రభావాలను చూసి మహిళలు భయపడిపోతున్నారు. అలా వాటిని వాడటం వల్ల భారతదేశంలో ప్రతీ ఏటా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు గర్భస్రావాలకు గురవుతున్నారు. వీరిలో 75 శాతం మంది మహిళలు వైద్యుడిని సంప్రదించకుండానే మందులు తీసుకుంటున్నారని గణాకాల్లో వెల్లడైంది.

Read more : Male Contraceptive Pill : బిల్‌గేట్స్‌ సహకారంతో మగవాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు

గర్భనిరోధక మాత్రల వేసుకోవటం వల్ల కడుపులో వికారం,వాంతులు, తలనొప్పి వంటి సమస్యలే కాకుండా అంత్యంత ప్రమాదకరంగా మారిని డిప్రెషన్‌ లకు కూడా గురవుతున్నారని ఇటీవల పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అలాగే కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కావటం లేదా పీరియడ్స్ లో అన్ బ్యాలెన్స్ అంటే సరైన సమయానికి రాకపోవటం వంటి సమస్యలు వచ్చినట్లుగా తేలింది.

గర్భనిరోధక మాత్రలు 25-45 ఏండ్ల వయసు లోపు మహిళలు వాడకూడదు. కౌమారదశలో ఉన్నవారు తరచు వీటిని వాడితే..అవి వారి పునరుత్పత్తి వ్యవస్థపై పెను ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయని..యువతులు ఈ మాత్రలు తీసుకోవడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఈ మాత్రలు వాడటం వల్ల రుతుస్రావం తగ్గిపోయి బరువు పెరగుతాయని ఈ అధ్యయనంలో తేలింది.

ఈ మాత్రలు వాడేవారు దృష్టిలో పెట్టుకోవాలసిన విషయాలు..
ఊబకాయం, మధుమేహం ఉన్నవారు, ధూమపానం అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే 10 ఏళ్లకు పైగా ఈ మాత్రలు వాడితే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నారు.

ఇటువంటివారు గర్భనిరోధక మాత్రలు అస్సలు వాడొద్దు..
ఎందుకంటే..గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ను ప్రభావితం చేస్తాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. వంశపారంపర్యంగా రక్తం గడ్డకట్లే సమస్యలు ఉన్నవారు గర్భనిరోధక మాత్రలు అస్సలు వాడకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడే వారు కూడా వాడవద్దు. ఈ మాత్రలు వాడాలనుకునేవారు కచ్చితంగా వైద్యుల సలహా ప్రకారమే వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని పరిశోధకులు పదే పదే హెచ్చరిస్తున్నారు.