Male Contraceptive Pill : బిల్‌గేట్స్‌ సహకారంతో మగవాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు

గర్భనిరోధక మాత్రలు అంటే ఆడవాళ్లకే కాదు ఇకనుంచి మగవారికి కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ కుబేరుడు..మైక్రోసాఫ్ట్ అధినేత బిల్స్ గేట్స్ సహాయంతో మగవారి కోసం గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రానున్నాయి.

Male Contraceptive Pill : బిల్‌గేట్స్‌ సహకారంతో మగవాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు

Male Contraceptive Pill

Male Contraceptive Pill: గర్భనిరోధక మాత్రలు అంటే ఆడవాళ్లే ఉపయోగిస్తారు. వారికే ఇటువంటి మాత్రలు ఉన్నాయి. కానీ ఇకనుంచి మగవారికి కూడా గర్భనిరోధక మాత్రంలు అందుబాటులోకి రానున్నాయి. అదేంటీ గర్భాన్ని నిరోధించేవి గర్భనిరోధక మాత్రంలు గర్భం ఆడవారికి కదా వస్తుంది.మరి మగవారికి గర్భనిరోధక మాత్రలు ఏంటీ అనే డౌట్ రావచ్చు.నిజమే..గర్భాన్ని నిరోధించటానికి మాత్రలు, లూప్ వంటి పలు సాధనాలుంటాయి మహిళలకు. అదే మగవారికైతే కండోమ్స్ ఉపయోగిస్తారు. కానీ ఇకనుంచి మగవారికి కూడా గర్భనిరోధక మాత్రలు మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఇంకా తయారీ దశలోనే ఉండటంతో..వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలా మగవారికి గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటానికి ఓ ప్రముఖ వ్యక్తి సహాయరం అందిస్తున్నారు.

అతనే ద గ్రేట్ పర్సన్ ప్రపంచ కుబేరుడు..మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌. మగవారికి గర్భనిరోధక మాత్రలు తయారీకి ప్రయోగాలకు బిల్స్ గేట్స్ సహకారం అందిస్తున్నారు. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది. దీని కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్‌ నుంచి 1.7 మిలియన్‌ డాలర్ల సాయం అందించారు బిల్ గేట్స్.ఈ మగవారి గర్భనిరోధక మాత్రలు ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో.. గవాళ్లపై పని చేస్తాయట. అంటే.. మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీని నిలిపివేస్తాయన్నమాట. స్కాట్లాండ్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ డుండీ ఈ మాత్రలకు సంబంధించి ప్రయోగాలు చేస్తోంది. గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా..ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది.

బిల్‌గేట్స్‌ సహకారం
ఈ మాత్రలు మార్కెట్‌లోకి అతి త్వరలోనే రావచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వర్శిటీ పరిశోధనలకు బిల్‌ గేట్స్‌ ఈ ప్రయోగాల వెనుక ఉండడంతో ఈ మాత్రలు త్వరలోనే రావచ్చంటున్నారు. వారి సహాయ సహకారాలతో వీటిని త్వరలోనే మార్కెట్ లోకి వచ్చేలా చేస్తున్నామని తెలిపారు.ఈ మాత్రలు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉండేలా రూపొందిస్తున్నామని డుండీ యూనివర్సిటీ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ క్రిస్‌ బర్రాత్‌ వెల్లడించారు.
సురక్షిత శృంగారం, ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్‌లను అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కానీ కండోమ్స్ తరువాత మగవారి కోసం ప్రత్యేకంగా ఎటువంటి గర్భనిరోధక సాధనాలు లేవు. ఈ విషయంలో మెడికల్‌ సైన్స్‌లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ క్రమంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు..రానున్నాయి.

కండోమ్‌లు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుండి చూసుకుంటే..2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. కండోమ్స్ అవాంఛిత గర్భాలను అడ్డుకోవట్లేదని తేలింది. ముఖ్యంగా పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని University of Dundee ప్రొఫెసర్‌ క్రిస్‌ చెప్తున్నారు. అయితే ఈ మాత్రలు సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా? అని ప్రశ్నిస్తే.. తమ పరిధిలో ఆ అంశం లేదంటున్నారు. కండోమ్‌లు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుండి మగ గర్భనిరోధకాలపై ఎలాంటి పురోగతి లేదు – మరియు 2015-19 మధ్య 121 మిలియన్ అవాంఛిత గర్భాలు సంభవించాయి, ఇవి ప్రపంచంలోని అత్యంత పేద ప్రాంతాలలో మూడు రెట్లు ఎక్కువ.