Tests for women : 30 ఏళ్లు దాటిన మహిళలకు ఈ 6 పరీక్షలు తప్పనిసరి!

30ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు 6 పరీక్షలను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఈ వయసు దాటిన మహిళల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని చెబుతున్నారు

Tests for women : 30 ఏళ్లు దాటిన మహిళలకు ఈ 6 పరీక్షలు తప్పనిసరి!

Tests For Women

Tests for women : 30 ఏళ్లు దాటిన మహిళల్లో అనేక రకాల హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. పెరుగుతున్న వయసు జీవక్రియపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా తక్కువ వయసులోనే షుగర్, బీపీ వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టి ఖచ్చితంగా 30ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు 6 పరీక్షలను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు.

కంప్లీట్ బ్లడ్ పిక్చర్
రక్తహీనత, ఇన్‌ఫెక్షన్, కొన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడానికి సీబీపీ నిర్వహిస్తారు. ఎర్ర, తెల్ల రక్త కణాల కౌంటింగ్‌, హిమోగ్లోబిన్, హెమటోక్రిట్, ప్లేట్‌లెట్ల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దేశంలో చాలామంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీనిని ముందుగానే గుర్తించాలి అంటే ఈ పరీక్ష తప్పనిసరి. ఈ పరీక్ష చేయించుకుని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

థైరాయిడ్ టెస్ట్
మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. 20 ఏండ్ల వయసు దాటి ప్రతీ ఒక్క మహిళ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ సమస్య వలన సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయి. అధిక బరువు, లేదంటే బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలకు థైరాయిడ్ కారణమవుతుంది. దీనిని ముందుగానే గుర్తిస్తే.. అనర్దాలు జరగవనని వైద్యులు చెబుతున్నారు. ఈ పరీక్ష ద్వారా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గుర్తించవచ్చు. థైరాయిడ్ రుగ్మత పురుషులతో పోలిస్తే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువ. 35 సంవత్సరాల వయసు తర్వాత హైపోథైరాయిడిజం ప్రమాదం పెరుగుతుంది.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష
లిపిడ్ ప్రొఫైల్.. లిపిడ్స్ అని పిలిచే రక్తంలోని నిర్దిష్ట కొవ్వు అణువుల పరిమాణాన్ని కొలుస్తుంది. సీబీసీతో కొలెస్ట్రాల్‌ని గుర్తించవచ్చు. ఈ పరీక్ష గుండె జబ్బులు, రక్త నాళాల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి సహాయపడుతుంది. ఈ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సెట్ అవ్వొచ్చు. ఆహార అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం, జీవనశైలిని సరిచేయడానికి లిపిడ్ ప్రొఫైల్‌ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది.

మామోగ్రామ్
దేశంలో రొమ్ముక్యాన్సర్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి 8మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారు. 40 ఏండ్ల వయసు దాటిన తర్వాత మామోగ్రఫీ చేయించుకోవడం చాలా అవసరమని క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగిన మహిళలను 20 సంవత్సరాల వయసు నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్షించాలి.

పాప్ స్మెర్ పరీక్ష
ఈ పరీక్ష ద్వారా గర్భాశయంలోని గత క్యాన్సర్ మార్పులను కనుగొనవచ్చు. 21 సంవత్సరాల వయసు దాటిన మహిళలు ఈ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేయబడింది.

రక్తంలో చక్కెర

కొందరు మహిళలు ఇంటికే పరిమితం కావడం.. సరైన వ్యాయామాలు చేయకపోవడంతో తక్కువ వయసులోనే మధుమేహం భారిన పడుతున్నారు. కొందరిలో దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నప్పటికీ.. లక్షణాలు కనిపించక పోవడం వల్ల గుర్తించలేకపోతున్నారు. డయాబెటిస్ రక్తంలో చక్కెర ఆకస్మిక పెరుగుదలకు కారణమవుతుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర పరీక్షలను సాధార పరీక్షలతోపాటు జరిపించుకోవడం ద్వారా చక్కెర వ్యాధి పెరుగకుండా చూసుకోవచ్చు.