×
Ad

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు మహాపాపం చేశారు, నెయ్యి రేట్ల పెంపు స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి- సజ్జల డిమాండ్

ఆరోపణలు వస్తే తప్పేమీ కాదనటం, పదవి పెద్ద లెక్క కాదని మాట్లాడటం మరీ దుర్మార్గం అన్నారు.

  • Published On : March 7, 2026 / 04:31 PM IST

Sajjala Ramakrishna Reddy

  • లోతుగా విచారణ జరిపితే తప్పకుండా పెద్ద స్కామ్ బయటికి వస్తుంది
  • దేవుడిని అడ్డుపెట్టుకుని జగన్ ని కొట్టాలని చూస్తున్నారు
  • టీటీడీ చైర్మన్ వీడియోలు బయటికి వస్తే చర్యలు తీసుకోరా..?

Sajjala Ramakrishna Reddy: నెయ్యి రేట్ల పెంపు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. 2014 నుండి విచారణ జరిగితే చంద్రబాబు అసలు బండారం బయటపడుతుందన్నారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ ఫర్మేషన్ తో తాము ఈ స్కామ్ ను గమనించామన్నారు. లోతుగా విచారణ జరిపితే తప్పకుండా ఈ పెద్ద స్కామ్ బయటికి వస్తుందన్నారు. కింది లెవల్ లో జరిగే వ్యవహారం కాదు.. పైస్థాయిలో వ్యక్తులు ఉన్నారు.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేస్తామని సజ్జల అన్నారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలు బయటికి వచ్చాయి మరి చర్యలు తీసుకోరా..? అని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిని తప్పించకపోవడం చంద్రబాబు పెద్ద తప్పు అని మండిపడ్డారు. ఆరోపణలు వస్తే తప్పేమీ కాదనటం, పదవి పెద్ద లెక్క కాదని మాట్లాడటం మరీ దుర్మార్గం అన్నారు. ఒక ఆడియో బయటకు వస్తేనే మేము ఎస్వీబీసీ చైర్మన్ ని రాజీనామా చేయించాము అని గుర్తు చేశారాయన. అలాంటిది వీడియోలు, ఆరోపణలు బయటికి వస్తే తప్పించాలి కదా అని వ్యాఖ్యానించారు. మిగిలిన చోట్ల పెద్దగా పట్టించుకోకపోయినా టీటీడీలో ఇలాంటి ఆరోపణలు వస్తే తక్షణం తప్పించాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

కూటమి ప్రభుత్వంపై సజ్జల నిప్పులు చెరిగారు. రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ తయారు చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. దేవుడిని అడ్డుపెట్టుకుని జగన్ ని కొట్టాలని చూస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు స్కామ్స్ లో ఈ స్కామ్ కూడా ఓ కలికితురాయి లాంటిది అంటూ ఎద్దేవా చేశారు. సొంత కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు చంద్రబాబు మహా పాపం చేశారని సజ్జల అన్నారు.

Also Read: వార్ ఎఫెక్ట్‌.. గ్యాస్ వినియోగదారులకు బిగ్‌షాక్.. భారీగా పెరిగిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..