Sajjala Ramakrishna Reddy
వైఎస్సార్సీపీ నేతలతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని, వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 13, డిసెంబరు 27, జనవరి 3 వ తేదీలలో మూడు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు.
ఈ క్రమంలో రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని నిర్ణయించిందని సజ్జల చెప్పారు. తాము చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ గట్టిగా తీర్మానం చేసిందని తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు.
కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్ షర్మిల