Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy: ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సంచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఇందుకోసం పరీక్షా, ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేసి వీరిని ఉద్యోగాలలోకి తీసుకున్నా.. కొద్దికాలంగా వీరిని తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులంతా ఆ సచివాలయమున్న పరిధిలోనే నివాసం ఉండాలని ప్రభుత్వం ఆదేశించిన అనంతరం ఈ ప్రచారం ఎక్కువైంది.
దీనికి తోడుగా ఏపీ ప్రభుత్వ సర్వీస్ కమీషన్, లేక మరేదైనా వ్యవస్థ ద్వారా నియమితులైన ఉద్యోగులను మాత్రమే పర్మనెంట్ చేస్తారని.. సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రాతిపదిక లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. కాగా, దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులు ఎవరూ అధైర్య పడవద్దని.. ఏ ఒక్కరి ఉద్యోగం పోదని చెప్పారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జల ఈ మేరకు హామీ ఇచ్చారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైనా పర్మినెంట్ ఉద్యోగులు కావాలంటే డిపార్ట్మెంట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సిందేనని.. ఐఏఎస్ అధికారుల నుండి అటెండర్ వరకు అందరికీ ఇదే విధానమన్నారు. అయితే.. అలా కానీ వారికి ప్రొబేషన్ పొడగిస్తారు తప్ప ఉద్యోగాల నుండి తొలగించరని చెప్పారు. సచివాలయ సిబ్బంది ఉద్యోగాల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని సజ్జల మరోసారి హామీ ఇచ్చారు.