సీఎం జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడు సతీశ్‌కు బెయిల్  

Stone pelting case: పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది. కాగా, గత నెల 13న విజయవాడలో జగన్‌పై..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై రాయిదాడి కేసులో నిందితుడు సతీశ్‌కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. ప్రతి శనివారం, ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రూ.50 వేలకు ఇద్దరు షూరిటీలు ఇవ్వాలని చెప్పింది.

ఊరు వదిలి వెళ్లకూడదని తెలిపింది. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది. కాగా, గత నెల 13న విజయవాడలో జగన్‌పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తున్నముఖ్యమంత్రి జగన్‎ పై రాయి విసరడంతో ఆయన కనుబొమ్మ పైభాగంలో అది తాకింది.

దీంతో కంటిపై గాయం కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు జగన్ కు చికిత్స అందించారు. గాయమైన చోట కుట్లు కూడా వేశారు. ఇదే ఘటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికీ గాయమైంది. ఈ కేసులో సతీశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు జైలు సతీశ్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రాయి దాడి కేసులో సతీశ్ కు బెయిల్ రావడం సంతోషంగా ఉందని లాయర్ సలీం అన్నారు.

Also Read: దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారు- సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు