Nominations
Huzurabad, Badwel by-elections : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 30న జరుగనున్న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతోంది. వచ్చిన నామినేషన్లను ఉదయం 10 గంటల నుంచి అధికారులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. తెలంగాణలోని హుజూరాబాద్‌లో మొత్తం 92 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని 61మంది అభ్యర్థులు సమర్పించినట్టు అధికారులు తెలిపారు.
బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మినహా మిగతా వారంతా గుర్తింపులేని పార్టీలు, స్వతంత్రులే ఉన్నారు. రాజేందర్ పేరుతో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. 12మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా బరిలో నిలిచారు. బీజేపీ తరపున ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు.
Huzurabad by poll: హుజూరాబాద్ బై పోల్ అభ్యర్థుల్లో బలహీనతలేంటి..?
అటు ఏపీలోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు 35 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ, బీజేపీ అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్రులు నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరపున వనతల సురేష్‌ను పోటీలో నిలిచారు. వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధాన పోరు జరుగనుంది.
హుజూరాబాద్, బద్వేల్ రెండుచోట్లా అధికారులు సాయంత్రం కల్లా నామినేషన్ల పరిశీలన పూర్తి చేయనున్నారు. ఇక 13న నామినేషన్ల ఉపసంహరణ. దీంతో 13న పోటీలో నిలిచే అభ్యర్థులెవరో తేలనుంది.