sec nimmagadda ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారాయన. బుధవారం(నవంబర్ 18,2020) సుమారు 40 నిమిషాలు గవర్నర్ తో భేటీ అయ్యారు నిమ్మగడ్డ రమేష్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తో చర్చించారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ సీఎస్ రాసిన లేఖపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
https://10tv.in/pawan-kalyan-key-comments-on-ap-capital-amaravati/
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని గవర్నర్ తో చెప్పారాయన. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్ కు తెలిపారు నిమ్మగడ్డ. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరుని ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సాకులు చెబుతోందని నిమ్మగడ్డ చెప్పారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఎస్ఈసీ లాంటి సంస్థలను చిన్నబుచ్చే విధంగా అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఎస్ఈసీ.