AP Panchayat Elections: ఏపీలో 13,219 పంచాయతీలకు ఎన్నికలు.. నవంబర్ 13న షెడ్యూల్.. మూడు దశల్లో ఎన్నికలు!

ఆంధ్రప్రదేశ్‌లో 13,219 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు(AP Panchayat Elections) ఎస్‌ఈసీ సిద్ధమైంది నవంబర్ 13న షెడ్యూల్ విడుదల కానుంది.

Sec to release ap panchayat elections schedule on november 13 voting in three phases

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సర్వం సిద్ధం చేస్తూ పక్కా కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 13,219 పంచాయతీలకు పంచాయతీ(AP Panchayat Elections) పోరు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ నెల (నవంబరు) 13వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Chinna Jeeyar Swamy Birthday: ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా చిన్న జీయర్ స్వామి 70వ జన్మదిన వేడుకలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం!

మూడు దశల్లో పల్లె పోరు.. డిసెంబర్ 2తో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ:

ఈ పల్లె పోరును మొత్తం మూడు దశల్లో నిర్వహించేలా ముహూర్తం ఖరారు చేశారు. నవంబరు 13న మొదటి దశ, 16న రెండో దశ, 19న మూడో దశకు నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. ఇక పోలింగ్ విషయానికి వస్తే నవంబరు 26న మొదటి విడత, నవంబరు 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కానుంది. ఎన్నికల తేదీల ప్రకటనతో గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించాయి.