Shankar Narayana: ఎమ్మెల్యే శంకర్ నారాయణ కాన్వాయ్‌పై డిటోనేటర్ విసిరి.. కలకలం రేపి..

దీనిపై అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Shankar Narayana

Shankar Narayana: ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ కాన్వాయ్ పై డిటోనేటర్ విసిరాడో దుండగుడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గుడ్డం తండాకు శంకర్ నారాయణ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. డిటోనేటర్ పేలకపోవడంతో శంకర్ నారాయణ సురక్షితంగా బయటపడ్డారు.

ఆయన కాన్వాయ్ లోని ఓ కారుపై ఆ డిటోనేటర్ పడింది. దీనిపై అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి యత్నించిన వ్యక్తి ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లి వాసిగా తెలుస్తోంది. అతడు మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దీనిపై శంకర నారాయణ స్పందిస్తూ… ఈ దాడి హత్యాయత్నమేనని అన్నారు. ఎవరు చేయించారో తేలాలని చెప్పారు. ప్రజల్లో తనకు ఆదరణ పెరిగిపోతోందని, అందుకే అసూయతో దాడి చేశారని అన్నారు. కాగా, శంకర్ నారాయణ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గోరంట్ల మండల కేంద్రంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

Nushrratt Bharuccha : ఎట్టకేలకు ఇండియాకు.. ఇజ్రాయిల్ లో చిక్కుకున్న బాలీవుడ్ నటి..