×
Ad

“ఒరేయ్‌.. మీరు ముగ్గురు వచ్చి మా ఇంట్లో చోరీ చేయండ్రా..” అని ఫ్రెండ్స్‌కి చెప్పిన యువకుడు.. ఆ తర్వాత ..

మనవడే ఈ డ్రామా ఆడి చోరీ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 5వ తేదీన 12 తులాల బంగారం, డైమండ్ రింగ్, రూ.50 వేలు నగదు, కారు చోరీ జరిగింది.

Visakhapatnam: విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ చోరీ కలకలం రేపింది. ఓ యువకుడిని, అతడి నానమ్మను తాళ్లతో కట్టేసి ఇంట్లోంచి చోరీ చేశారు ముగ్గురు వ్యక్తులు. ఈ కేసును పోలీసులు చేధించారు. మనవడే ఇంటి దొంగగా గుర్తించారు.

సీపీ శంఖభ్రత బాగ్చి ఈ కేసు గురించి వివరాలు తెలిపారు. ఈ నెల 5వ తేదీన 12 తులాల బంగారం, డైమండ్ రింగ్, రూ.50 వేలు నగదు, కారు చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దొంగలు.. ఆ ఇంట్లోని కృష్ణ కాంత్, అతడి నాన్నమ్మ కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి చోరీ చేశారు.

Also Read: సర్సర్లే ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ట్రంప్‌పై మీమ్స్‌.. పిచ్చ కామెడీ.. చూస్తే పడీపడీ నవ్వాల్సిందే..

దర్యాప్తులో భాగంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా మనవడే ఈ డ్రామా ఆడి చోరీ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి కృష్ణ కాంత్ అప్పుల పాలయ్యాడు.

అప్పులు తీర్చడానికి స్నేహితులతో ఫేక్ రాబరీని చేయించాడు. నిందితులు కృష్ణ కాంత్(19), ప్రమోద్ కుమార్ (30), షేక్ అభిషేక్ (21), సత్య సూర్య కుమార్ (24)ను పోలీసులు అరెస్టు చేశారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసును ఛేదించినట్లు పోలీసులు వివరించారు.