×
Ad

Somireddy Chandra Mohan Reddy: అసెంబ్లీలో జగన్‌పై మాజీమంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తారు, ర్యాలీలు చేస్తారు అని విమర్శించారు. శవ రాజకీయాల కోసమే జగన్ పార్టీని స్థాపించారని విరుచుకుపడ్డారు.

  • Published On : February 13, 2026 / 05:02 PM IST

Somireddy Chandra Mohan Reddy Representative Image (Image Credit To Original Source)

  • జగన్ ‘మర్చంట్ ఆఫ్ డెత్’
  • జగన్‌కు విధ్వంసం, శవ రాజకీయాలంటే ఇష్టం
  • బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తారు, ర్యాలీలు చేస్తారు

 

Somireddy Chandra Mohan Reddy: ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోయారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ‘మర్చంట్ ఆఫ్ డెత్’ అంటూ అభివర్ణించారు సోమిరెడ్డి. జగన్‌కు విధ్వంసం, శవ రాజకీయాలంటే ఇష్టం అని అన్నారు. తన ర్యాలీలో కార్యకర్త చనిపోతే కనీసం పరామర్శకు వెళ్లలేదని దుయ్యబట్టారు. బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తారు, ర్యాలీలు చేస్తారు అని విమర్శించారు. శవ రాజకీయాల కోసమే జగన్ పార్టీని స్థాపించారని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు ప్రత్యర్థి పార్టీ నేతల తల్లిదండ్రులను తిట్టినా జగన్ కట్టడి చేయరని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

Also Read: అంబటి రాంబాబు ఇష్యూపై నారా లోకేశ్, బొత్స మాటల మంటలు.. చివరకు అనిత కూడా..