ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశారు.
అమరావతి : ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. సర్వేపల్లి స్థానం నుంచి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. టీడీపీలో సోమిరెడ్డి కీలక నేతగా ఉన్నారు. వాక్ చాతుర్యం ఉన్న వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రతిపక్షాల విమర్శలకు ఆయన ధీటైన సమాధానం ఇస్తారు. ఇప్పటికే రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. అలాగే మంత్రి కరణం బలరాం, నారా లోకష్, నారాయణలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది.