grants bail to Achennayudu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సోంపేట కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా జైలు నుంచి అచ్చెన్నాయుడు విడుదల కానున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో మూడు గంటల పాటు వాదన జరిగింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థానంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీంతో ప్రభుత్వం తరఫున సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అచ్చెన్నాయుడుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో బెయిల్ ఇవ్వకూడదని వాదించారు.
అయితే అచ్చెన్న తరపు లాయర్ గొర్లె రామారావు వాదనతో ఏకీభవించిన కోర్టు.. 50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నాయుడుతో పాటు ఈ కేసులో ఉన్న 22 మందికి కూడా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.