Pawan Kalyan Special Bus : పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్న బస్సు.. కార్ వాన్ తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు

జనసేనాని రాష్ట్ర పర్యటనకు బస్సు సిద్ధమవుతోంది. కార్ వాన్ తరహాలో ప్రత్యేక బస్సు రెడీ చేసుకుంటున్నారు పవర్ స్టార్. బస్సులో అన్ని హంగులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుని పరిశీలించిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పుల కోసం సూచనలు చేశారు.

Pawan Kalyan Special Bus : జనసేనాని రాష్ట్ర పర్యటనకు బస్సు సిద్ధమవుతోంది. కార్ వాన్ తరహాలో ప్రత్యేక బస్సు రెడీ చేసుకుంటున్నారు పవర్ స్టార్. బస్సులో అన్ని హంగులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుని పరిశీలించిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పుల కోసం సూచనలు చేశారు.

జనసేనాని పవన్‌ త్వరలోనే యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ప్రత్యేక బస్సు తయారు చేయించుకుంటున్నారు. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ బస్సు.. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ బస్సు యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేశారు. రెగ్యులర్ బస్సులు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాపులో తయారవుతున్న ఈ బస్సుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చి.. సోషల్‌ మీడియాలో రచ్చ చేశాయి. ఈ స్పెషల్ బస్సు హంగులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రత్యేక వాహనాన్ని పరిశీలించారు పవన్. బస్సును పరిశీలించిన పవన్.. కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక, ఈ బస్సుకు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. ఎంత దూరంలో ఉన్నా వారికి పవన్ కల్యాణ్‌ కనిపించేలా బస్ టాప్‌ ఏర్పాటు చేస్తున్నారు. యాత్ర జరిగినన్ని రోజులు పవన్ అందులోనే ఉండనున్న నేపథ్యంలో.. ఆయన అలవాట్లు, అవసరాలకు తగ్గట్టుగా అందులో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా, వైసీపీ ఓటమే ధ్యేయంగా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రజలకు చేరువయ్యే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో భాగమే జనసేన జనవాణి. జనవాణిలో వచ్చిన ఆర్జీలను అధ్యయనం చేస్తున్నారు పవన్. సమస్యలపై అధ్యయనం పూర్తయ్యాక బస్సు యాత్ర ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ ఇదివరకే చెప్పారు. కాగా, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని పవన్ ధీమాగా ఉన్నారు. వైసీపీకి 45-67 సీట్లే రాబోతున్నాయని పదే పదే చెబుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా.. మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది జాయింట్‌ యాక్షన్‌ కమిటీ. ఆ పిలుపునకు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే, అదే రోజు జనసేన అధినేత విశాఖకు రానున్నడం ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెంచుతుంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు విశాఖలో జనసేనాని పర్యటన కొనసాగనుంది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా 15న విశాఖలో అడుగుపెట్టబోతున్నారు పవన్‌.

పవన్‌ వైజాగ్‌ టూర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. 15వ తేదీన మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్నారు పవన్‌.. అదే రోజు విశాఖపట్నం అర్బన్‌, రూరల్‌ పరిధిలోని జనసేన నాయకులతో పార్టీ ప్రణాళికలు, అమలు అంశాలపై చర్చించనున్నారు.. ఇక, 16న ఉదయం 9 గంటలకు పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల ‘జనవాణి’ కార్యక్రమంలో పవన్‌ పాల్గొంటారు. ప్రజల నుంచి సమస్యలపై వచ్చే అర్జీలను స్వయంగా స్వీకరిస్తారు. సమస్యలను తెలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఇక, 17వ తేదీన ఉదయం మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం బీచ్‌ రోడ్డులోని వైఎంసీఏ హాల్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం అవుతారు.