Srikakulam Bus Fire Accident: శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. నరసన్నపేట వద్ద ప్రైవేట్ బస్సు దగ్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్(Srikakulam Bus Fire Accident) బస్సులో ఘోర ప్రమోదం చోటుచేసుకుంది.

Srikakulam private travels bus fire accident narasannapeta

Srikakulam Bus Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Srikakulam Bus Fire Accident)లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై జమ్మూ జంక్షన్ వద్దకు చేరుకోగానే బస్సు టైరు పెద్ద శబ్దంతో పేలిపోవడంతో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. క్షణాల్లోనే వ్యాపించిన మంటల దాటికి వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతై భస్మీపటలమైంది.

AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికల ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు.. ఉత్తర్వులు జారీ

ప్రయాణికులు సురక్షితం.. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్!

టైరు పేలి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, ప్రయాణికులు తక్షణమే అప్రమత్తమై బస్సు నుంచి కిందకు దిగిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ హఠాత్ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు తీవ్ర స్థాయిలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.