Srikalahasti Temple : శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ పూజ రద్దు.. టికెట్ ధరల్లో మార్పులు.. స్థానికులకు మాత్రం గుడ్‌న్యూస్
Srikalahasti Temple : ఏపీలోని శివుని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో శ్రీకాళహస్తిలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఆలయంకు వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్స్.. పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
- Harishth Thanniru
- Published on- April 17, 2026 / 10:15 AM IST
Srikalahasti Temple
- శ్రీకాళహస్తి ఆలయంకు వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్
- రూ.500 రాహుకేతు పూజ రద్దు
- రూ. 5వేల టికెట్ రూ.6వేలకు పెంపు
- స్థానికులకే రూ.100కే పూజ
Srikalahasti Temple : ఏపీలోని శివుని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో శ్రీకాళహస్తిలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని కాళా రుషి నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. సహజంగా ఏర్పడిన స్పటిక లింగం ఇక్కడి మరో ప్రత్యేకత. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ రాహు-కేతు సర్పదోష నివారణకు ప్రసిద్ధి.
తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నదీతీరలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఇకనుంచి ఈ ఆలయం వెళ్లే భక్తులు ఈ విషయాలను గమనించాలి. ఎందుకంటే ఆలయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పాలక మండలి పలు కీలక తీర్మానాలు చేసింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి సమావేశంలో 14 అంశాలను చర్చించి, ఆమోదించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు కేతు పూజకు ఎంతో విశిష్టత ఉంది. ప్రస్తుతం రాహుకేతు పూజ విధానంలో పలు మార్పులు చేశారు. రూ.500 రాహుకేతు పూజను పాలకమండలి రద్దు చేసింది. అలాగే పెరిగిన వెండి ధరల కారణంగా రూ.5వేలు ఉన్న రాహుకేతు పూజను రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాహుకేతు పూజలు ప్రారంభ ధరలు రూ.750, రూ.1500, రూ.2500, రూ.6వేలుగా నిర్ణయించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతీ సామాన్య భక్తుడికి పాలక మండలి శుభవార్త చెప్పింది. స్థానికులకు రాహుకేతు పూజలను మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వారికి కేవలం రూ.100కే సామూహిక రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, వారంలో బుధవారం మాత్రమే స్థానికులకు ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించనున్నట్లు పాలకమండలి పేర్కొంది. ఈ పూజలో వెండి సర్పాలు లేకుండా పూజా సామాగ్రితోనే పూజలు చేయిస్తారు. అదేవిధంగా దక్షిణమూర్తి అభిషేకం టికెట్ ఒకరికి రూ.500గా నిర్ణయించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రూ.500ల అంతరాలయం దర్శనం టికెట్ తీసుకునే భక్తులకు ఒక లడ్డుతోపాటు ఒక వడను ఉచితంగా అందజేయనున్నారు. మరోవైపు భరద్వాజ తీర్థం అభివృద్ధితోపాటు క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా విశ్రాంత గదులను ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా అమలు చేసేందుకు శ్రీకాళహస్తి ఆలయ వర్గాలు చర్యలు చేపట్టాయి.
ముఖ్యమైన వివరాలు..
♦ రూ.500 రాహుకేతు పూజ రద్దు
♦ రూ.5వేల టికెట్ రూ.6వేలకు పెంపు
♦ కొత్త ధరలు : రూ.750, రూ.1500, రూ. 2,500, రూ. 6,000
♦ స్థానికులకు ప్రత్యేక దర్శనం:
♦ తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి రూ.కే రాహు, కేతు సర్పదోష పూజ (కేవలం బుధవారం మాత్రమే)
♦ రూ. 500 దర్శనం టికెట్ కొన్నవారికి ఒక లడ్డూ, ఒక వడ ఉచితంగా అందజేత.
♦ ఆలయంలో క్యూలైన్లలో విశ్రాంతి గదులు నిర్మాణంకు చర్యలు
♦ భరద్వాజ తీర్థం అభివృద్ధికి నిర్ణయం.
