Srikrishna Devaraya University
Mrityunjaya Homam SKU : అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. యూనివర్శిటీలో మృత్యుంజయ హోమం జరిపించాలని రిజిస్ట్రార్ నిర్ణయించారు. ఇటీవల కొంతకాలంగా యూనివర్శిటీలో వివిధ కారణాలతో 25 మంది మృతి చెందారు.
యూనివర్శిటీకి చెందిన వారు మృతి చెందుతుండడంతో యూనివర్శిటీలో మృత్యుంజయ హోమం జరిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ సర్క్యూలర్ ను జారీ చేశారు. మృత్యుంజయ హోమం కోసం టీచింగ్ సిబ్బంది రూ.500, నాన్ టీచింగ్ సిబ్బంది రూ.100 చెల్లించాలని ఉత్తర్వుల్లో ఉండటం ఇప్పుడు కలకలం రేపుతుంది.