Srisailam Temple: 10టీవీ కథనానికి స్పందన, శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులు సస్పెండ్

శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. 10టీవీ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు విధించారు.

Srisailam Temple Police Issue

Srisailam Temple Police pay cards Issue : శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. నంద్యాల జిల్లాలో 10టీవీ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. పవిత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సస్పెండ్ వేటు విధించారు. శ్రీశైలంలోని బ్రంహరి సదన్ లో ఐదుగురు హోమ్ గార్డులు, ఒక కానిస్టేబుల్ పేకాట ఆడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో, మద్యం,మాసం, జూదం నిషేధం. అటువంటిది ఏకంగా పోలీసులు పేకాట ఆడుతు పట్టుబడ్డారు. ఈ విషయంపై 10టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసులపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐగురిని సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదంటు వార్నింగ్ ఇచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు