Students Fighting
Students fighting in Gannavaram : కృష్ణా జిల్లా గన్నవరంలో గ్యాంగ్ వార్‌ను తలపించేలా విద్యార్థులు కొట్టుకున్నారు. కర్రలు, బ్లేడ్‌లతో దాడులు చేసుకున్నారు. పామర్తినగర్‌కు చెందిన యాసిన్, మర్లపాడుకు చెందిన సాయి మధ్య ఫ్రీఫైర్ గేమ్ విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది.
రాత్రి 10గంటల 30 నిమిషాల సమయంలో గన్నవరం బాయ్స్ హైస్కూల్ ఆవరణలో ఇరు వర్గాలకు చెందిన 30మంది విద్యార్థులు కర్రలు, బ్లేడ్‌తో దాడి చేసుకున్నారు. గణేశ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. 10మంది విద్యార్థులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.