సజ్జల భార్గవ్‌కు సుప్రీకోర్టులో చుక్కెదురు.. ‘తప్పు ఎవరు చేసినా తప్పే.. చర్యలు తధ్యం’..
తప్పు ఎవరు చేసినా తప్పే.. ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
- Harishth Thanniru
- Published On : May 23, 2025 / 12:40 PM IST
Sajjala Bhargav
Supreme Court: వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును భార్గవ్ ఆశ్రయించాడు. శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే, భార్గవ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Also Read: Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్‌షాక్.. లుకౌట్ నోటీసులు జారీ..
నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జస్టిస్ పంకజ్ మిత్తల్, ఎస్వీ ఎన్ బట్టి ధర్మాసనం సూచించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందన్న సుప్రీం ధర్మాసనం.. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతిఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
తప్పు ఎవరు చేసినా తప్పే.. ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఎవరు తప్పు చేసినా వ్యవస్థ చర్యలు తీసుకోవటం తధ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.
