Supreme Court :రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని పిటిషన్లపై స్టే విధిస్తున్నట్లు 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం వెలువరించింది. సెలవులు తర్వాత..తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలైంది. దీనిపై సుప్రీం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ సర్కార్‌కు భారీ ఊరట లభించినట్లైందంటున్నారు.
మరోవైపు…ఏపీ ప్రభుత్వం, ఎస్‌ఈసీగా మధ్య పంచాయతీ నడుస్తోంది. కోర్టు ధిక్కరణ కింద ప్రభుత్వంపై కేసు వేసింది. హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా..ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని, ఎన్నికల కమిషన్ లేఖ రాసినా స్పందించడం లేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది వెల్లడించారు. చీఫ్ సెక్రటరీ ప్రతి స్పందన తీరు సరిగ్గా లేదన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వానికి ఆదేశాలిలవ్వాలని కోర్టును కోరారు.