వారి వల్ల దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం.. ఆ దాడులను తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతోంది: పవన్

తీరంలో కొత్తవారి కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.

Pawan Kalyan

రోహింగ్యాల వల్ల అంతర్గత భద్రతకు ప్రమాదమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో పవన్ మీడియాతో మాట్లాడారు. రోహింగ్యాలు మన దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొందరు ప్రాత్ర ఉందని చెప్పారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర.. సిరాజ్ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి..

సరిహద్దుల్లో సైనికులు ఎంతో అప్రమత్తతతో ఉంటారని, వారి కంటే ఎక్కువగా పోలీసులు ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదుల లక్ష్యాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. తీరంలో కొత్తవారి కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని గతంలో తాను సూచనలు చేస్తూ లేఖ రాశానని పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో కోయంబత్తూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగాయని, వాటిని తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు.

కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. పేలుళ్ల కోసం సౌదీ అరేబియాలోని ఐఎస్‌ ఉగ్రవాదుల సాయంతో తెలుగు రాష్ట్రాల యువకులు సయ్యద్‌ సమీర్‌, సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ పన్నారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌, ఏపీకి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ను పోలీసులు విచారించి కీలక వివరాలు రాబట్టారు.