50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి : చంద్రబాబు

ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వీవీ ప్యాట్లలో 50శాతం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తూ....సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.

  • Publish Date - April 23, 2019 / 04:02 PM IST

ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వీవీ ప్యాట్లలో 50శాతం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తూ….సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.

ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వీవీ ప్యాట్లలో 50శాతం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తూ….సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. 50 శాతం స్లిప్పులను లెక్కించిన తర్వాతే…ఫలితాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి వెళ్లిన ఆయన.. ఈవీఎం లోపాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. 

ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని చాలా దేశాలు బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపునకు 6రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాలని.. అది కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. 

వీవీప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోలాలన్నారు. ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఉదయం లోపాలు వస్తే మధ్యాహ్నానికి సరిచేసే పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో సీఈవో కూడా ఓటు వేసేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ హయాంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు నిర్వీర్యమయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.