రైతులే అయితే.. ఆడి కార్లు, ఖద్దరు షర్టులు, బంగారు గాజులు ఎలా వచ్చాయి..?

రాజధాని అంశంపై ఎస్వీబీసై చైర్మన్ పృథ్వీ స్పందించారు. రాజధాని ప్రాంతం అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం పెయిడ్ ఆర్టిస్టులదే అని పృథ్వీ అన్నారు. వీళ్లంతా రైతులైతే

  • Publish Date - January 4, 2020 / 03:56 PM IST

రాజధాని అంశంపై ఎస్వీబీసై చైర్మన్ పృథ్వీ స్పందించారు. రాజధాని ప్రాంతం అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం పెయిడ్ ఆర్టిస్టులదే అని పృథ్వీ అన్నారు. వీళ్లంతా రైతులైతే

రాజధాని అంశంపై ఎస్వీబీసై చైర్మన్ పృథ్వీ స్పందించారు. రాజధాని ప్రాంతం అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం పెయిడ్ ఆర్టిస్టులదే అని పృథ్వీ అన్నారు. వీళ్లంతా రైతులైతే ఆడికార్లు, ఖద్దరు షర్టులు, చేతికి బంగారు గాజులు ఎలా ఉంటాయి ఆయన ప్రశ్నించారు. ఇది కార్పొరేట్ ముసుగులో సాగుతున్న రైతు ఉద్యమం అని ఆయన ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇలాంటివి కనపడడం లేదా అని పృథ్వీ నిలదీశారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై పృథ్వీ స్పందించారు. తిరుమలలో అలాంటిదేమీ లేదన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. 18 రోజుల నుంచి రైతులు, మహిళలు నిరసన కొనసాగిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సకల జనుల సమ్మె కూడా చేపట్టారు. రాజధాని గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చారని ప్రశ్నిస్తున్నారు.

కాగా, వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. నిజమైన రైతులెవరూ ఉద్యమాలు, పోరాటాలు చేయడం లేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారని చెబుతున్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయని వివరిస్తున్నారు. అమరావతి పంట పొలాల్లో రాజధాని నిర్మాణం సరికాదంటున్నారు. ఒక నగరం నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. అదే డబ్బుతో రాష్ట్రాంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయొచ్చని తెలిపారు.

Also Read : ఏసీబీ డీజీపై బదిలీ వేటు… సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేసిన రెండు రోజులకే