Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు సొంతూరిలో కూడా మా ప్రభుత్వమే బాగుచేసింది -సజ్జల రామకృష్ణా రెడ్డి

ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Sajjala

Sajjala Ramakrishna Reddy: ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ఎవరిమీదా ఒత్తిడి చేయడం లేదన్నారు సజ్జల. స్వచ్చందంగా ముందుకు వచ్చిన విద్యాసంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు సజ్జల.

విద్యాసంస్థల్లో సంస్కరణలకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పేద్దవాళ్లు చదువుకోవడం ఎలా? అని లోకేష్ అడుగుతున్నాడని, పేదలకు రూపాయి ఖర్చు లేకుండా చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

చంద్రబాబు హయాంలో అనేక ఘోరాలు జరిగాయని, వచ్చే 5, పదేళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు సజ్జల. నాడు నేడుతో పాటు స్కూల‌్‌కి వెళ్లే పిల్లలకు బట్టలు, పుస్తకాలు, బూట్లు పౌష్టికాహారం ఇవ్వటంతో పాటు పేద విద్యార్ధులకు అమ్మవడి పథకాలను ప్రభుత్వం అమలుచేస్తుందని అన్నారు. చంద్రబాబు సొంత ఊరిలో ప్రభుత్వ పాఠశాలను కూడా మా ప్రభుత్వమే బాగు చేసిందని అన్నారు సజ్జల.