Tamil Nadu CM Vijay : నేడు ఏపీలో పర్యటించనున్న తమిళనాడు సీఎం విజయ్.. షెడ్యూల్ ఇదే.. చంద్రబాబుతో కీలక సమావేశం..
Tamil Nadu CM Vijay AP Tour : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆయన ఏపీలోకి అడుగు పెట్టబోతున్నారు.
- Harish Thanniru
- Published on- October 13, 2026 / 08:16 AM IST
Tamil Nadu Cm Vijay
Tamil Nadu CM Vijay AP Tour : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆయన ఏపీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎంవో నుంచి అధికారులు, భద్రతా సిబ్బంది విజయవాడకు వచ్చి సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే, సీఎం విజయ్ తన పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ మధ్యామ్నం 2.30 గంటలకు నీలంకరై క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 3గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఏపీ ప్రభుత్వం తరపున విజయ్ కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి విజయ్ వెళ్లనున్నారు.
చంద్రబాబుతో భేటీలో గోదావరి-కావేరీ జలాల అనుసంధానం, కృష్ణా నది నీటి విడుదలపై విజయ్ చర్చించనున్నారు. ఈ భేటీలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. చంద్రబాబుతో సమావేశం ముగిసిన తరువాత రాత్రి 7.10 గంటలకు విజయవాడ ఉత్సవ్ 2.0లో విజయ్ పాల్గోనున్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విజయ్ కలుస్తారని సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన లేదు. రాత్రి 8.50 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి విజయ్ చేరుకొని.. అక్కడి నుంచి చెన్నైకు వెళ్తారు. రాత్రి 10.00 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రాత్రి 10.30 గంటలకు క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటారు.
