Tammareddy Bharadwaja: చిరంజీవి మా నాయకుడే.. కానీ సీఎంకు ఇదే నా విజ్ఞప్తి..: తమ్మారెడ్డి భరద్వాజ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో.. రేపు (గురువారం) చిరంజీవి కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక కామెంట్లు చేశారు.

Tammareddy Bharadwaja: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో.. రేపు (గురువారం) చిరంజీవి కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక కామెంట్లు చేశారు. చిరంజీవిని ఏపీ ప్రభుత్వం గుర్తించిందని.. అది తనకు సంతోషమే అని చెప్పారు. చిరంజీవి తమ నాయకుడే అని తేల్చి చెప్పారు. కానీ.. కీలక నిర్ణయం తీసుకునే ముందు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను పిలిపించి మాట్లాడాలని ముఖ్యమంత్రి జగన్ కు తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. టికెట్ రేట్ల విషయంపై స్పందిస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆన్ లైన్ విధానాన్ని తీసుకొస్తాయని చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఆన్ లైన్ టికెటింగ్ విధానమంటూ వస్తే.. దోపిడీ అడ్డగోలుగా పెరుగుతుందని తమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. FDC తో కలిపి.. ఈ విధానాన్ని అమలు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. చిన్న సినిమాలకు థియేటర్లలో ఐదో షో ద్వారా అవకాశం కల్పించాలని అన్నారు. నంది అవార్డుల ప్రదానోత్సవంపైనా తెలుగు రాష్ట్రాల నుంచి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆంధ్రాలో లొకేషన్ చార్జీలు తీసుకోవడం లేదని.. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.

రెమ్యూనరేషన్ విషయంలోనూ తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్.. కొన్ని లగ్జరీలను వదిలేయాలని కోరారు. కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు కానీ.. కొన్నింటిని వదిలేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామని.. ఇప్పుడు మీడియాకు చెబుతున్నానని అన్నారు. ఇక.. సీఎంతో చిరంజీవి సమావేశంపై స్పందిస్తూ.. ఎవరు వెళ్లి మాట్లాడినా సినీ పరిశ్రమ సమస్యలపైనే అని స్పష్టం చేశారు. కొందరిని ప్రభుత్వం పిలవనప్పుడు.. అడుక్కుని పిలిపించుకోవడం అన్నది సరికాదని అన్నారు. చిరును ప్రభుత్వం గుర్తించిందని.. సంతోషం వ్యక్తం చేశారు.

Read More:

Film Tickets Issue : చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్: మంచు విష్ణు

Ram Gopal Varma : టికెట్ రేట్లపై ఆర్జీవీ ఆర్గ్యుమెంట్స్

ట్రెండింగ్ వార్తలు