కోడెల ఆత్మహత్య వ్యవహారంపై ఏపీ గవర్నర్ ని కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రేపు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ని కలిసేందుకు టీడీపీ నాయకులు అపాయింట్ మెంట్ తీసుకున్నారు.
కొడెల మృతిపై సీబీఐ దర్యాప్తుకు టీడీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆత్మహత్యకు పురిగొల్పే విధంగా టీడీపీ నాయకులను ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రేపు ఉదయం చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నాయకులు సమావేశమై వీటన్నింటిపై చర్చించి ఓ వినతిపత్రంతో గవర్నర్ ని కలవనున్నట్లు తెలుస్తోంది.