Godavari Floods: వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

కొద్ది రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు, నదీతీరాన నివాసాలు ఏర్పరచుకున్న వారు వరదల కారణంగా నష్టానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

Chandrababu Warning

 

 

Godavari Floods: కొద్ది రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు, నదీతీరాన నివాసాలు ఏర్పరచుకున్న వారు వరదల కారణంగా నష్టానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

జులై 21 గురువారం పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద నష్టాన్ని పరిశీలనలో భాగంగా పర్యటన సాగనుంది. చంద్రబాబు మధ్యాహ్నం నాగుల్లంక నుంచి వరద ప్రాంతాల పర్యటన ప్రారంభిస్తారు.

2 గంటల సమయంలో ఆచంట నుండి రోడ్ మార్గంలో లేదా పడవ మీద కానీ పి.గన్నవరం మండలం నాగులపల్లి చేరుకుంటారు. స్థానికంగా వరద కారణంగా నష్టపోయిన వారితో మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3గంటల 15నిమిషాలకి రోడ్ మార్గంలో పి గన్నవరం మండలం మానేపల్లికి చేరుకుంటారు.

Read Also: చంద్రబాబు సమీక్షా సమావేశాల్లో గందరగోళం

అక్కడి పరిస్థితులను గమనించి మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకి మామిడికుదురు మండలం అప్పన్నపల్లికి వెళతారు. వారితో కాసేపు మాట్లాడిన అనంతరం సాయంత్రం 5 గంటలకు అప్పనపల్లి నుండి రోడ్ మార్గంలో రాజోలుకు చేరుకుంటారు. ప్రభావిత ప్రాంతంలో పరిస్థితులు పరిశీలించి బాధితులతో మాట్లాడతారు.

సాయంత్రం 7 గంటలకు పశ్చిమ గోదావరి పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్‌లో రాత్రి బస చేస్తారు.