Puttaparthi Municipal Elections : పుట్టపర్తి మున్సిపల్ పీఠంపై టీడీపీ ఫోకస్‌.. తెరవెనక చక్రం తిప్పుతోంది ఎవరు ?

Puttaparthi Municipal Elections : ఏపీలో లోకల్‌ ఫైట్‌ ఫీవర్‌ పీక్స్‌కు చేరింది. కూటమి పార్టీ అధినేతల వరుస భేటీలు.. కీలక నిర్ణయాలతో.. క్షేత్రస్థాయిలో కేడర్‌ మంచి జోష్‌ మీద కనిపిస్తోంది.

Puttaparthi Municipal Elections

Puttaparthi Municipal Elections : ఏపీలో లోకల్‌ ఫైట్‌ ఫీవర్‌ పీక్స్‌కు చేరింది. కూటమి పార్టీ అధినేతల వరుస భేటీలు.. కీలక నిర్ణయాలతో.. క్షేత్రస్థాయిలో కేడర్‌ మంచి జోష్‌ మీద కనిపిస్తోంది. షెడ్యూల్ రిలీజ్‌ కాకపోయినా.. నోటిఫికేషన్‌ రాకపోయినా.. గ్రౌండ్‌ లెవల్‌లో ఎవరికి వారు స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో.. రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయ్‌.

Also Read : AP Local Body Elections : లోకల్ ఫైట్‌లో కూటమి మాస్టర్ ప్లాన్‌! వైసీపీకి బిగ్‌షాక్ తప్పదా? గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయ్‌?

పైకి ప్రశాంతంగా కనిపించినా.. తెరవెనక ఎత్తులకు పైఎత్తులు నడుస్తుంటాయ్. రాజకీయాల్లో మంట పుట్టిస్తుంటాయ్‌. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలక రంగం సిద్ధం అవుతున్న వేళ.. పుట్టపర్తి రాజకీయాలు మరింత రంజుగా మారాయ్‌. గత ఎన్నికల్లో చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న వైసీపీ.. ఈసారి తప్పకుండా బరిలో ఉంటామని చెప్తోంది. ఐతే అభ్యర్థి ఎంపిక మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కూటమి పార్టీల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ తరఫున ఎవరు బరిలో ఉంటారన్నది స్పష్టత లేదు. జనసేనలో మాత్రం కొన్ని పేర్లు తెరమీదకు వస్తున్నాయ్‌.

జనసేన తరఫున మున్సిపల్ చైర్మన్ రేసులో అబ్దుల్, తొట్ల గంగాధర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్‌. ఇక అటు బీజేపీ నుంచి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్‌కు సన్నిహితులైన కొండమ రాజుతో పాటు.. హరికృష్ణ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ సత్తా చాటడంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకు గాను.. 16 వార్డులలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ తరఫున కేవలం నలుగురు మాత్రమే గెలిచారు. ఐతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తర్వాత.. జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పీఠాలను కైవసం చేసుకున్నారు. పుట్టపర్తిలో మాత్రం అలా జరగలేదు. ఇక్కడ మున్సిపాలిటీలో అలాంటి చాన్స్‌ ఉన్నా.. ఎమ్మెల్యే పల్లె సింధూర అంత ఫోకస్ చేయలేదు.

పుట్టపర్తి మున్సిపాలిటీలో మొత్తం 29వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి కోసం పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. పుట్టపర్తి మున్సిపాలిటీ అయినప్పటి నుంచీ.. రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు చైర్మన్ పదవి దక్కించుకోగా.. ఒక్కసారి వైసీపీ పీఠంపై కూర్చుంది. ప్రస్తుత వార్డుల సంఖ్యను 20 నుంచి 28కి పెంచారు. దీంతో ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా మారే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పరిధిలో బోయ, బలిజ, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. గతంలో రెండుసార్లు బోయ సామాజికవర్గానికి చెందిన నేతలు.. ఒకసారి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన నాయకుడు చైర్మన్‌గా పనిచేశారు. మరి ఇప్పుడు ఈ రెండు సామాజికవర్గాల వారికే మరోసారి అవకాశం దక్కుతుందా.. లేదంటే ఇతరులకు అవకాశం ఇస్తారా అనేది కీలకంగా మారింది.

కూటమి తరఫున ఏ పార్టీ అభ్యర్థి.. ఏ సామాజికవర్గానికి చెందిన నేత బరిలో ఉంటారో తేలితే.. దానికి అనుగుణంగా వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ్‌. కూటమి పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో.. టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాత్ర కీలకం కాబోతోంది. ఆయన కేంద్రంగానే తెర వెనక మంత్రాంగం నడుస్తుందనే గుసగుసలు పుట్టపర్తి పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.