విశాఖలో తాగడానికి నీళ్లు కూడా లేవు : రాష్ట్రం విడిపోవడానికి జగనే కారణం

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. విశాను

  • Publish Date - January 28, 2020 / 09:37 AM IST

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. విశాను

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. విశాను రాజధానిగా చేయడం రాంగ్ డెసిషన్ అన్నారు. విశాఖలో తాగడానికి నీళ్లు కూడా లేవని జలీల్ ఖాన్ చెప్పారు. అలాంటి ప్రాంతంలో రాజధాని పెడితే కొత్తగా ఏం అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏదనుకుంటే అది జరిగిపోతుందని అనుకోవడం భ్రమే అన్నారు. ప్రభుత్వాలు అనుకుంటే సరిపోదు.. కోర్టులున్నాయని గుర్తించాలని జలీల్ ఖాన్ సూచించారు.

లోకేష్ సంగతి సరే.. విజయమ్మ ఎందుకు ఓడారు:
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి స్కీమ్ పై జలీల్ ఖాన్ విమర్శలు చేశారు. అమ్మఒడి స్కీమ్ మంచిదే.. కానీ.. అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మంచి పాలన అంటే ఆటో వాళ్లకు డబ్బులు ఇవ్వడమేనా అని ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ ఓడిన సంగతి తెలిసిందే. లోకేష్ ఓడిపోయారని పదే పదే విమర్శలు చేసేవాళ్లు.. వైఎస్ విజయమ్మ ఎందుకు ఓడారో చెప్పాలని జలీల్ ఖాన్ నిలదీశారు.

జగన్ వల్లే రాష్ట్ర విభజన:
రాష్ట్ర విభజనపై జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజనకు జగనే కారణం అన్నారు. జగన్ ఓదార్పు యాత్రతోనే రాష్ట్రం విడిపోయిందని ఆరోపించారు. ఇక చట్టసభల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే బీపీ పెరుగుతుందన్నారు జలీల్ ఖాన్.

Also Read : మండలికి మంగళం : టీడీపీ కన్నా వైసీపీకే నష్టం ఎక్కువ..!